అంకితభావంతో పని చేయాలి
నారాయణపేట: విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాని, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో 9 నెలల ట్రైనింగ్ పూర్తి చేసుకొని విధుల్లో చేరిన 78 మంది కానిస్టేబుళ్లకు, 47మంది సివిల్ కానిస్టేబుళ్లకు ఎస్పీ పోస్టింగ్ ఇచ్చారు. అలాగే 31 మంది అర్ముడ్ రిజర్వు పోలీసులకు జిల్లా స్పెషల్ పార్టీకి పోస్టింగ్ ఇచ్చి వారికి ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పని చేయడం అనేది ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ సేవ చేసే గొప్ప అవకాశమన్నారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యున్నత స్థాయిలో జిల్లాలో పోలీసులు వినియోగిస్తున్నారని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. పలు సమస్యల పరిష్కారం కోసం వచ్చే బాధితులకు మేమున్నామనే భరోసా కల్పించాలని , విధి నిర్వహణలో కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యమివ్వాలన్నారు. క్రమశిక్షణ ఎంతో ముఖ్యమైనదని, అధికారులు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు శంకర్‌లాల్, రామ్‌లాల్, నరసింహ, శివశంకర్, రాములు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు
నారాయణపేట: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఈ నెల రోజుల పాటు 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ యోగేష్ గౌతమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగుడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం శిక్ష అర్హులవుతారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment