కోస్గి పుర అభివృద్ధికి రూ.353 కోట్లు
కోస్గి: కొడంగల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోస్గి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.353.34 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ జీఓ విడుదల చేసింది. గతంలోనే మున్సిపల్ అభివృద్ధికి సంబందించి హైద్రాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ కన్సెల్టెన్సీ ద్వారా సమగ్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు, చేపట్టే పనులపై డీపీఆర్ తయారు చేయించిన రేవంత్ సర్కార్ దాని ఆధారంగా నిధులు మంజూరు చేసింది. ఈ నిధులను రెండు ప్యాకేజీలుగా విభజించి అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించేలా కలెక్టర్‌తోపాటు కడా చైర్మన్‌కు ఆదేశాలు సైతం జారీ చేశారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో మొదటి ప్యాకేజీ కింద రూ.254.45 కోట్లతో అభివృద్ది పనులు చేయాల్సి ఉంది. మొదటి ప్యాకేజీలో తాగునీటి సరఫరాకు రూ.8.35 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.145.81 కోట్లు, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ కోసం రూ.71.04 కోట్లు, రెజువనేషన్ వాటర్ బాడీస్ కోసం రూ.18.77 కోట్లు, సోలిడ్ వేస్టేజ్ మేనేజ్‌మెంట్ కోసం రూ.10.48 కోట్లు మంజూరు చేశారు. రెండో ప్యాకేజీ కింద రోడ్లు, చౌరస్తాలు, స్వాగత బోర్డుల ఏర్పాటు కోసం రూ.98.89 కోట్లు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేయడంపై మండల పార్టీ అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బెజ్జు రాములు, పట్టణ అధ్యక్షుడు తుడుం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, నాయకులు అన్న కిష్టప్పతోపాటు కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేశారు.
జీఓ విడుదల చేసినరాష్ట్ర మున్సిపల్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment