భగత్‌సింగ్ విగ్రహావిష్కరణ
దామరగిద్ద: మండలంలోని ఉడ్మల్‌గిద్దలో పీడీఎస్‌యూ పీవైఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగత్‌సింగ్ విగ్రహాన్ని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ముఖ్య అథితిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పేదలు సంపద సృష్టిస్తే పెత్తందారులు అనుభవిస్తున్నారని, ఆ సంపద పేదలకు అందేవరకు పోరాటం చేయాలన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలతో పెట్టుబడి దారి వ్యవస్థను అవలంభిస్తుందన్నారు. దేశం, రాష్ట్రంలో ప్రభుత్వాలు పెత్తందారి విధానాలకు స్వస్థి పలికి పేదలను పట్టించుకోవాలన్నారు. సీపీఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి రాంచందర్ మాట్లాడుతూ దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా పోరాడే యువత భగత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కృష్ణ, రాము, తాయప్ప, కాశీనాఽథ్, ప్రదీప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment