నారాయణపేట రూరల్ /మాగనూర్: మండలంలోని మాగనూర్ ప్రభుత్వ జెడ్పీ స్కూల్‌లో గత నెల 20న మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. ప్రభుత్వం డీఈఓ, రెగ్యులర్ జీహెచ్‌ఎం, మరో హెచ్‌ఎం బాబుల్‌రెడ్డిపై చర్యలు తీసుకుంది. అయితే, పాఠశాల రెగ్యులర్ జీహెచ్‌ఎం, ఎంఈఓగా వ్యవహరిస్తున్న మురళీధర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి జీహెచ్‌ఎంగా కొనసాగించాలని మంగళవారం ఆర్‌జేడీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఆర్డర్ కాపీలో పొందుపర్చారు.
తెల్ల కందులు @ 11,515
నారాయణపేట: స్థానిక మార్కెట్ యార్డులో తెల్ల కందులు క్వింటాకు గరిష్టంగా రూ.11,515, కనిష్టంగా రూ.10,700 ధర పలికింది. వడ్లు సోనా గరిష్టం రూ.2,736, కనిష్టం రూ.1,600, హంస గరిష్టంగా రూ.2,823, కనిష్టంగా రూ.1,920 ధర పలికాయి.
Comments
Please login to add a commentAdd a comment