మీసేవ నిర్వాహుకులు నిబంధనలు పాటించాలి
మద్దూరు: మీసేవ కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఈడీఎం విజయ్‌కుమార్ తెలియజేశారు. మంగళవారం మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రాలను జిల్లా మేనేజర్ రాంమోహన్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో అందుతున్న సేవలను ప్రజలకు వివరించారు. నిబంధనల మేరకు ఎక్కడ కేటాయించిన కేంద్రాలు ఆ గ్రామాల్లోనే కొనసాగించాలని సూచించారు. అధికంగా డబ్బులు వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో కంరోద్దీన్, రాంగోవిందు, కాసీం, వెంకటేష్, బాలగంఘాధర్, నవీన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
హక్కులకు భంగం కలిగించొద్దు
నారాయణపేట రూరల్:హక్కులను ఆయుధాలుగా ఉపయోగించుకొని వ్యక్తిత్వ వికాసం దిశలో ముందుకు సాగాలని, ఎవరి హక్కులకు భంగం కలిగించకూడదని జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మహమ్మద్ ఉమర్ అన్నారు. డిసెంబర్ 10న ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా జాజాపూర్ జడ్పీ స్కూల్‌లో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు బాల్యం నుంచి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే బంగారు భవిష్యత్తుకు బాట పడుతుందన్నారు. చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, న్యాయపరమైన రక్షణ, చట్టపరమైన అవగాహన కల్పించారు. హక్కులపై అవగాహన పెంచుకోవాలని వాటికి విఘాతం కలిగినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి సంపూర్ణ న్యాయం పొందాలని సూచించారు. హెచ్‌ఎం విజయ, డీఎస్‌ఓ భాను ప్రకాష్, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ, లక్ష్మిపతి గౌడ్, వెంకటేష్ పాల్గొన్నారు.
తెలంగాణ అస్తిత్వాన్నిదెబ్బతీసే కుట్ర
మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తుందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మక్తల్‌లో తెలంగాణ తల్లి చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ అంటే బతుకమ్మ అని, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆకాంక్షలను రగిలించిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చ డం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నర్సింహాగౌడ్, రాజేష్‌గౌడ్, రాజుల ఆశిరెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, మారుతిగౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
సత్వర వైద్య సేవలుఅందించడమే లక్ష్యం
మాగనూర్: ప్రజలకు అత్యవసర సమయాల్లో సత్వర వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతోనే సీఎం రేవంత్‌రెడ్డి 108 నూతన అంబులెన్స్‌లను మంజూరు చేశారని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం 108 అంబులెన్స్‌కు పూజలు చేసి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్నాళ్లు మండలంలో అంబులెన్స్ లేకపోవడంతో చాలా మంది క్షతగాత్రులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారన్నారు. మండల పరిధిలో ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే మక్తల్, నారాయణపేట లాంటి ప్రాంతాల నుంచి అంబులెన్స్‌లు వచ్చి క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్చేవి అని, దీంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆ ఇబ్బందులు పడకూడదనే అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి, ఆనంద్‌గౌడ్, నాగజ్యోతి, అఫ్రోజ్ , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment