ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపాలి
నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీలోగా తెలియజేయాలని అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం రాజకీయ పార్టీల నాయకులను కోరారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ పర్యవేక్షణలో ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ నెల 7వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు. జిల్లా పరిధిలో 280 జీపీలు, 2544 వార్డులు, పోలింగ్ కేంద్రాలను ముసాయిదా జాబితాలో పొందుపర్చడం జరిగిందని వివరించారు. ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12 వ తేదీలోపు తెలపవచ్చని, 12న అన్ని మండలాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు నిర్వహించే సమావేశంలోనూ అభ్యంతరాలు స్వీకరిస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరించడం జరుగుతుందని, జిల్లా పాలనాధికారి ఆమోదం అనంతరం ఈ నెల 17న తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించబడుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,09,090 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. కొత్త ఓటర్లు ఒకే వార్డులో ఉండాలి అని రాజకీయ ప్రతినిధులు సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి, డిప్యూటీ సీఈఓ జ్యోతి, డీపీఓ కృష్ణ , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
‘ధరణి’ పెండింగ్ పనులు పూర్తి చేయాలి
నారాయణపేట: ధరణిలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ బేన్ షాలం ఆదేశించారు. మంగళవారం వీసీలో హాల్లో తహసీల్దార్లతో ఫారం 6, 7, 8 పెండింగ్‌పై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి చేయాలని, ధరణిపై ఏ సమస్యలు ఉన్నాయని తహసీల్దార్లను ఆరా తీశారు. డాటా కరెక్షన్, మిస్సింగ్, సర్వే నంబర్లు ల్యాండ్ సీలింగ్ ఎలా చేస్తున్నారని అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment