మూడు రోజులునీటి సరఫరా బంద్
నారాయణపేట: పట్టణానికి తాగునీరు అందించే మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్‌కు సింగారం చౌరస్తా దగ్గర లీకేజీ కావడంతో మూడు రోజుల పాటు తాగునీరు సరఫరాలో అంతరాయం కలుగుతుందని, ఇందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ సునీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లీకేజీ మరమ్మతుల పనులు మున్సిపల్ ఇంజనీర్ మహేశ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని, సాధ్యమైనంత త్వరలో తాగునీటి సరఫరా పునరుద్ధరణకు ప్రయత్నిస్తామని తెలిపారు.
ఇండియన్ అబ్జర్వర్‌గా ఎస్.వెంకటేశ్ నియామకం
నారాయణపేట: ఎస్‌జీఎఫ్‌ఐ ఎన్‌ఎస్‌జీ వాలీబాల్ అండర్ –19 బాలుర చాంపియన్‌సిప్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణకు ఇండియన్ అబ్జర్వర్‌గా నారాయణపేట డీవైఎస్‌ఓ వెంకటేశ్‌శెట్టిని నియమిస్తూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.సురేశ్‌దోషి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని కోస్గిలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఇండియా జాతీయ స్థాయి అండర్ –19 బాలుర పోటీలకు ఆయన అబ్జర్వర్‌గా వ్యవహరించనున్నారు. ఈ పోటీల్లో 22 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు , ఏడు నామినేటెడ్ విద్యా సంస్థల 33 జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీలు గురువారంతో ముగియనున్నాయి.
ఉద్యోగ భద్రత కల్పించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: స్థానిక నున్సిపాల్ పార్క్ దగ్గర సమగ్ర శిక్ష ఉద్యోగులు 14వ రోజు నల్ల దుస్తులు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మీ, పీవైఎల్ జిల్లా కార్యదర్శి ప్రతాప్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి నరసింహా పాల్గోని వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరి కాదని, వీరందరిని విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అదే విధంగా ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం..
మహబూబ్‌నగర్ రూరల్: మనస్మృతి వల్ల దళితులు అవమానాలకు గురై.. అణచివేయబడ్డారని, మెజార్టీ ప్రజలకు సర్వహక్కులు లేకుండా చేసిందని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్ అన్నారు. మనస్మృతి– రాజ్యాంగం అనే అంశంపై కేవీపీఎస్, టీపీఎస్‌కే, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు భరత్ అధ్యక్షతన చర్చాగోష్టిలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment