సైన్స్ ల్యాబ్‌లకు నిధులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యాసంవత్సరం దా దాపు ముగింపు దశకు రావడంతో ప్రభుత్వం సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలపై దృష్టి సారించింది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రయోగ పరీక్షలు జరగనున్నారు. ఈ క్రమంలో ఈనెల చివరి వారం నుంచి విద్యార్థులను సైన్స్ ప్రాక్టికల్స్‌కు సన్నద్ధం చేయాల్సి ఉంది. అందుకోసం ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న ల్యాబ్‌లలో వసతులు, సైన్స్ పరికరాలు, కెమికల్స్, రీఏజెంట్స్ వంటివి కొనేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఒక్కో కళాశాలకు రూ.25 వేల చొప్పున విడుదల చేసింది. చివరిసారిగా 2018–2019 విద్యాసంవత్సరంలో ల్యాబ్‌లలో వసతులు కల్పించేందుకు నిధులిచ్చారు. దాదాపు ఐదేళ్లుగా నిధులు విడుదల చేయకపోవ డంతో ప్రయోగశాలల పరిస్థితి దారుణంగా మారింది. చాలా విలువైన సైన్స్ పరికరాలు పాడైపోయా యని పలువురు సైన్స్ అధ్యాపకులు పేర్కొంటున్నారు. ప్రతి ఏడాది నిధులు విడుదల చేస్తే నిర్వహణ సులువుగా జరుగుతుందన్నారు.
● ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా మొత్తం 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉంటే వాటికి రూ.11.50 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీకి సంబంధించి ఏఏ పరికరాలు, కెమికల్స్ అవసరమో వాటికి సంబంధించిన ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ లెక్కలు తీసుకున్నారు. గతంలో ఉన్న చాలా పరికరాలు పాడైపోయినట్లు గుర్తించారు.
ఉమ్మడి జిల్లాలో 46 జూనియర్‌కళాశాలలకు నిధులు విడుదల
ఫిబ్రవరిలో ఇంటర్ ప్రయోగ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment