మళ్లీ గుప్పుమంటోంది!
తండాలు, పల్లెల్లో జోరుగా సారా తయారీ, విక్రయాలు
● గుడుంబాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు
● ఉమ్మడి జిల్లాలోని నాటుసారా స్థావరాలపై
ప్రత్యేక దృష్టి
● 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు స్పెషల్ డ్రైవ్
● ముడి పదార్థాల రవాణాపై పటిష్ట నిఘా
మహబూబ్‌నగర్ క్రైం: సారా తయారీ, విక్రయాలపై మరోసారి ఆబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపనుంది. వంద శాతం సారా రహిత జిల్లాగా మార్పు చేయాలనే ఉద్దేశంతో ఆబ్కారీశాఖ కఠినమైన విధివిధానాలు రూపొందించింది. ఇటీవల రాష్ట్రస్థాయిలో ఎకై ్సజ్ ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సారా తయారీ అధికంగా ఉన్న ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌ఓ స్టేషన్ వారీగా జాబితా సిద్ధం చేశారు. ఇందులో ఏ కేటగిరి నుంచి డీ వరకు వేర్వేరుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. ఈ క్రమంలో 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు దాదాపు నెలరోజులపాటు స్పెషల్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆబ్కారీ శాఖ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో సంబంధిత శాఖ అధికారులు సారా నియంత్రణపై ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా గిరిజన తండాలు, గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు, తయారీకి ఉపయోగించే బెల్లం, ఇతర ముడి పదార్థాల దిగుమతిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ కేసులో బైండోవర్ నమోదయ్యాక కూడా సారా అమ్ముతూ పట్టుబడితే వారి నుంచి రూ.2 లక్షల జరిమానా లేకపోతే జైలుశిక్ష విధించాలి.
Comments
Please login to add a commentAdd a comment