తెగుళ్ల బెడదతోనే..
మిరప పంటకు వరుసగా తెగుళ్ల బెడద తప్పడం లేదు. పెట్టుబడి మాత్రం రూ.లక్షలో ఖర్చు అవుతుంది. దిగుబడి ఆశించిన మేర రావడం లేదు. మార్కెట్‌లో కూడా మద్దతు ధర లేక రూ.లక్షల నష్టం వచ్చింది. ప్రభుత్వ పరంగా మిర్చి రైతులను ఆదుకోవాలి. లేదంటే పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక వలసలు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.
– వెంకటస్వామి, మిర్చి రైతు
రూ.1.50 లక్షలు అప్పు అయ్యింది..
రెండు ఎకరాల్లో మిరప పంట సాగు చేశాను. ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టాను. తీరా పంట నాటిన కొన్ని రోజులకే రకరకల తెగుళ్లు సోకాయి. 25 సార్లు మందు పిచికారీ చేశాను. మొదటి సారి కాపు తీయగా 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రంగు మారడంతో మార్కెట్‌లో వ్యాపారుల కాళ్లు పట్టుకొని క్వింటాల్ రూ.11 వేలకు అమ్ముకున్నాను. రెండు ఎకరాలకు కలిపి రూ. 2 లక్షల పెట్టుబడి పెడితే పంట విక్రయించగా రూ. 50 వేలు వచ్చాయి. దీంతో మిరప పంటను వదిలేశాను. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. – శ్రీనివాసులు, మిరప రైతు, మరికల్
●
Comments
Please login to add a commentAdd a comment