సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్‌ఫై ఫిర్యాదు నమోదైంది. సోషల్ మీడియాలో అభ్యంతర పోస్ట్‌లు పెట్టారని ఆరోపిస్తూ ముంబైకి చెందిన ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ద్వారా రెండు మతాలకు చెందిన వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని న్యాయవాది అలీ కాశీఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. దీనిపై అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై తొలి విచారణ ఆగస్టు 14న జరగనుందని న్యాయవాది తెలిపారు.
అభ్యంతరకరమైన ట్వీట్ చేశారంటూ ఇటీవల చందేల్ ఖాతాను ట్విటర్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, మొరదాబాద్‌లో కరోనాతో మృతి చెందిన ఒక జమాతీ కుటుంబానికి వైద్య పరీక్షలు చేయటానికి వెళ్లిన డాక్టర్లు, పోలీసులపై, వారు దాడి చేశారు. దీంతో సంబంధిత వర్గానికి చెందిన వారిని, సెక్యులర్ మీడియాను వరుసగా నిలబెట్టి కాల్చిపడేయాలని రంగోలీ ట్విట్ చేయడంతో దుమారం రేగింది. దీంతో రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాపై వేటు పడింది.
Comments
Please login to add a commentAdd a comment