PM Modi And Amit Shah To Visit Hyderabad For Three Days Tour, Details Inside - Sakshi
Sakshi News home page

PM Modi-Amit Shah: తెలంగాణకు ప్రధాని మోదీ, అమిత్‌ షా.. మూడు రోజులు మకాం

Published Wed, Jun 1 2022 12:39 PM | Last Updated on Wed, Jun 1 2022 1:24 PM

PM Modi And Amit Shah Visit Hyderabad For Three Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొద్ది రోజుల నుంచి రాజకీయాలు వేడెక్కాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు తెలంగాణలో పర్యటించడంతో పాలిటిక్స్‌ జోరందుకున్నాయి.  ఈ క్రమంలోనే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌ పెంచింది. 

మరోవైపు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై కసరత్తును ప్రారంభించింది. ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించునునారు. ఇందులో భాగంగా బీజేపీ నేషనల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బి.ఎల్‌. సంతోష్‌ నగరానికి బుధవారం వచ్చారు. కాగా, మూడు రోజల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాతో పాటుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు.

ఇది కూడా చదవండి: తొలిసారి కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement