పార్లమెంట్‌ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

Published Fri, Apr 19 2024 1:35 AM

-

నిర్మల్‌చైన్‌గేట్‌: పార్లమెంట్‌ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నోడల్‌ అధికారులతో ఎన్నికల ని ర్వహణపై గురువారం సమావేశం నిర్వహించా రు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో ర్యాంపులు, వీల్‌చైర్‌ ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ సి బ్బంది రవాణాకు రూట్‌ల వారీగా బస్సులను ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌ పోర్ట్‌ అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ పూర్తి చే యాలని, శిక్షణకు హాజరుకాని సిబ్బందికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఎన్నికల వ్యయాలను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. వంద శాతం ఓటింగ్‌ నమోదు దిశగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత స్వీప్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఫ్లెక్సీలు, సెల్ఫీపాయింట్‌, కళాజాత, 2కే రన్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 1950 కాల్‌ సెంటర్‌, సి విజిల్‌ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో నోడల్‌ అధికారులు భుజంగరావు, గోవింద్‌, శ్రీనివాస్‌, రవీందర్‌రెడ్డి, విజయలక్ష్మి, సందీప్‌, విష్ణువర్ధన్‌, ఈడీఎం నదీమ్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement