పండుగ పూట.. రైతులకు ఊరట
బస్తీ దవాఖానాకు సుస్తీ..!
భైంసా పట్టణంలోని ఏపీనగర్ బస్తీ దవాఖానాలో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. జిల్లాలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
IIIలోu
మంచిర్యాలఅగ్రికల్చర్/పెంచికల్‌పేట్: గతనెల మొదటి వారంలో భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంటలు నీట మునిగాయి. వరదలకు పొలాలు, చేలల్లో ఇసుక మేటలు వేశాయి. రోజుల తరబడి చేలల్లో నీరు నిల్వ ఉండడంతో పంటలు కుళ్లిపోయాయి. ఈ క్రమంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు సర్వే చేసి నష్టపోయిన పంటల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. వ్యవసాయాధికారులు సర్వే చేసి కలెక్టర్ ద్వారా నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం డబ్బులను ప్రభుత్వం బతుకమ్మ పండుగవేళ రైతుల ఖాతాల్లో జమచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సెప్టెబర్ 1 నుంచి 7వ తేదీ వరకు కురిసిన వర్షాలకు పత్తి, సోయా, వరి, కంది పంటలు దెబ్బతిన్నాయి. సర్వే చేసిన అధికారులు సెప్టెంబర్ 10న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 33 శాతానికిపైగా నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ పరిగణలోకి తీసుకుని సర్వేలో గుర్తించింది. ఇందులో అఽధికంగా పత్తి, వరి పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలతో పాటు తలమడుగు, బోథ్, గాదిగూడ, ఉట్నూర్, తాంసి, తదితర 8 మండలాల్లో పత్తి, సో యాబిన్, కంది, మొక్కజొన్న, వరి 3,096.03 ఎకరాల్లో నష్టం జరిగింది. ఈమేరకు 2,041 మంది బాధిత రైతులకు రూ.3,09,60,750 పరిహారం విడుదల చేసింది. మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, జైపూర్, జన్నారం, మంచిర్యాల, హాజీపూర్ మండలాల్లో పత్తి, వరి, కంది పంటలు 598.02 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఇందుకు 447 మంది రైతులకు రూ.59,80,500 విడుదల చేసింది. ఇక కుమురంభీం ఆసిఫాబా ద్ జిల్లాలో ప్రాణహిత, పెన్‌గంగ, పెద్దవాగు నదులు ఉప్పొంగి పంటలు దెబ్బతిన్నాయి. పెద్దవాగు పరీవాహక ప్రాంతాలైన వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లో పంటలు వరదల పాలయ్యాయి. అలాగే ప్రాణహిత, పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలైన సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్ మండలాల్లో పంటలు నీటమునిగాయి. జిల్లాలో మొత్తం 1,374 మంది రైతులకు చెందిన 2,692 ఎకరాల్లో పత్తి పంట వరదలకు దెబ్బతింది. ఎకరానికి రూ.10వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.2,69,22,750 విడుదల చేసింది. నిర్మల్ జిల్లాలో 33 శాతానికి మించి నష్టం జరుగకపోవడంతో ఈ జిల్లా రైతులకు ప్రభుత్వం పరిహారం విడుదల చేయలేదు.
ఖాతాలో పంట నష్ట పరిహారం జమ
ఎకరాకు రూ.10వేల చొప్పున విడుదల చేసిన ప్రభుత్వం
గత నెలలో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలు
జిల్లా ఎకరాలు రైతులు నగదు
ఆదిలాబాద్ 3,096.03 2,041 రూ. 3,09,60,750
కుమురంభీం 2,692.11 1,374 రూ.2,69,22,750
మంచిర్యాల 598.02 447 రూ.59,80,500
Comments
Please login to add a commentAdd a comment