నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Tue, Nov 19 2024 12:09 AM | Last Updated on Tue, Nov 19 2024 12:09 AM

నిర్మ

నిర్మల్‌

చలో.. ప్రకృతి ఒడికి
ప్రకృతి ప్రేమికులకు నిర్మల్‌ జిల్లా మామడ మండలం స్వాగతం పలుకుతోంది. యెంగ న్న, తుర్కం చెరువులకు ఇప్పటికే వలస పక్షులు తరలివచ్చాయి.

మంగళవారం శ్రీ 19 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

8లోu

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌కు సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. అదనపు కలెక్టర్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీతో కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్‌ సత్తి సాయన్న, కో కన్వీనర్‌ కె.ప్రవీణ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి ముత్యం, సెక్రెటరీ కె.భగవాన్‌, సత్యనారాయణ, నరసయ్య, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.

వడ్డీ బకాయిలు విడుదల

2,566 ఎస్‌హెచ్‌జీలకు లబ్ధి

జిల్లాకు రూ.1.10 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

డిసెంబర్‌కు ముందు బకాయిలపై స్పష్టత ఇవ్వని సర్కార్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: స్వయం సహాయక సంఘాల సభ్యులకు మంజూరు చేస్తున్న బ్యాంక్‌ లింకేజీ రుణాలకు సంబంధించి వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయమై ప్రభుత్వం నుంచి జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి కార్యాలయానికి లేఖ అందింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి బకాయిలు మంజూరు చేస్తున్నట్లు ఈ లేఖలో వెల్లడించారు. జిల్లాల్లో 2,566 సంఘాలకు రూ.1.10 కోట్లు విడుదల కాగా, ఈ నిధులను వడ్డీ లేని రుణాలకు అర్హత పొందిన సంఘాల సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు.

జిల్లాలో 11,983 సంఘాలు..

జిల్లాలోని 11,983 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలలో 1,34,002 మంది సభ్యులుగా ఉన్నారు. సంఘాల్లోని సభ్యులకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి, ఆదాయం వచ్చే ఆస్తులను కొనుగోలు చేసి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తారు. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధితోపాటు వివిధ రకాల రుణాలను అందిస్తారు. సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం తిరిగి వడ్డీని నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్లుగా వడ్డీ విడుదల చేయలేదు. దీంతో మహిళా సంఘాల సభ్యులు వడ్డీ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వడ్డీ బకాయిలను వెంటవెంటనే విడుదల చేస్తోంది.

స్వయం ఉపాధి..

మహిళా సంఘాలలో సభ్యులు తీసుకున్న రుణాలతో ఇతరులపై ఆధారపడకుండా తాను ఆర్థికంగా ఎదగడంతోపాటు మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లాలో చాలాచోట్ల వివిధ రకాల రుణాలు తీసుకుని క్యాంటీన్‌, పెరటికోళ్ల పెంపకం, గేదెల షెడ్డు (పాల ఉత్పత్తి)తో ఇతరులకు ఉపాధి చూపించే రంగాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సభ్యులకు రుణాలను అందించటమే కాకుండా వారు ఆదాయం వచ్చే యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అవగాహన కల్పిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.

పాత బకాయిల మాటేమిటి?

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే అధికారంలోకి రావడంతో గతేడాది డిసెంబర్‌ నుంచి బకాయిలను మహిళా సంఘాల సభ్యులకు చెల్లిస్తోంది. ఇలా ఇప్పటివరకు నాలుగు నెలల బకాయిలు చెల్లించినప్పటికీ అంతకు ముందు బకాయిలపై ప్రకటన చేయకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2019–20 నుంచి వేలాది సంఘాలకు వడ్డీ బకాయిలు పేరుకుపోవడంతో వాటిని విడుదల చేస్తుందా లేదా అనే అయోమయం సంఘాల్లో నెలకొంది. అంతేకాక ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు బకాయిలు కూడా అందాల్సి ఉంది.

సద్వినియోగం చేసుకోవాలి

మహిళా సంఘాల సభ్యులు సంఘం ద్వారా తీసుకున్న రుణాలు ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకుని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ నిధులు నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ అవుతాయి. తీసుకున్న రుణాలు వాయిదాల ప్రకారం చెల్లించి, తిరిగి రుణం పొందవచ్చు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి అందించటం జరుగుతుంది.

– విజయలక్ష్మి డీఆర్డీవో

న్యూస్‌రీల్‌

రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో దివ్యంగుల సంక్షేమానికి నిర్వహించే ఆశ్రమాలు, పాఠశాలలు, వివిధ సంస్థల నిర్వహణకు తప్పనిసరిగా ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం 2016 ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సంక్షేమ అధికారి పైజాన్‌ అహ్మద్‌ తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దివ్యాంగుల సంక్షేమ చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్‌ కోసం నవంబర్‌ 25లోపు నిర్మల్‌ జిల్లా, దివ్యాంగుల, వయోవృద్దులు, ట్రాన్సెండర్‌ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 25 తరువాత రిజిస్ట్రేషన్‌ చేసుకోని సంస్థలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వివరాలకు, సందేహాల నివృత్తికి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం(ఎఫ్‌–17 రూమ్‌లో కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.

వివరాలు:

మండలాలు 19

గ్రామ సమైక్య సంఘాలు 505

స్వయం సహాయక సంఘాలు 11,983

సభ్యులు 1,34,002

మండలాల వారీగా మాఫీ అయిన వడ్డీ..

మండలం మాఫీ అయిన మొత్తం

(రూ.లలో)

బాసర 2,26,715

భైంసా 7,24,856

దస్తూరాబాద్‌ 3,42,378

దిలావర్‌పూర్‌ 5,65,442

కడెం 7,16,450

ఖానాపూర్‌ 4,02,152

కుభీర్‌ 8,05,315

కుంటాల 3,73,674

లక్ష్మణచాంద 10,82,538

లోకేశ్వరం 7,42,232

మామడ 7,48,086

ముధోల్‌ 4,73,287

నర్సాపూర్‌(జి) 6,15,445

నిర్మల్‌ రూరల్‌ 9,29,391

పెంబి 1,58,153

సారంగపూర్‌ 9,85,896

సోన్‌ 5,69,268

తానూర్‌ 5,46,898

No comments yet. Be the first to comment!
Add a comment
నిర్మల్‌1
1/1

నిర్మల్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement