విస్తృతంగా ప్రజాపాలన విజయోత్సవాలు
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో మంగళవారం ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రజాపాలన కళాయాత్ర చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కళాయాత్ర ప్రతినిధులు ప్రొఫెసర్ అలేఖ్య పుంజల, అంతడుపుల నాగరాజు నేతృత్వంలోని బృందాలు రాష్ట్రమంతా పర్యటిస్తాయని వెల్లడించారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా కళాకారుల బృందం ఈనెల 21న సాంస్కృతిక కార్యక్రమాలను పట్టణంలోని దివ్య గార్డెన్స్‌లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సహా ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. కళాకారులకు తగిన వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని, వేదిక వద్ద అత్యవసర సేవల కోసం వైద్య బృందం అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, డీపీఆర్వో విష్ణువర్ధన్, సీపీవో జీవరత్నం, డీఆర్డీవో విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో గోవింద్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ సుభాష్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్‌గోపాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రచారరథం ప్రారంభం
ప్రజాపాలన కళాయాత్ర ప్రచార వాహనాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి కలెక్టరేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన వివిధ రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి డిసెంబర్ 7 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కళాకారుల బృందం పర్యటిస్తుందన్నారు.
సమన్వయ సమావేశంలో కలెక్టర్ అభిలాష అభినవ్
Comments
Please login to add a commentAdd a comment