గ్రంథాలయాలు సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్‌చైన్‌గేట్: గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. బుధవారం 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు పట్టుదలతో చదివి కొలువులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే పోటీలు నిర్వహించామన్నారు. జిల్లా గ్రంథాలయంలో పుస్తకాలకు కోడింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. అనంతరం ఇటీవల వివిధ కేటగిరీలలో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ అది, లైబ్రేరియన్ రాథోడ్ మోహన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
ఔదార్యం చాటుకున్న చైర్మన్
నిర్మల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ తన ఔదార్యం చాటుకున్నారు. కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికి వెళ్లి తిని వచ్చేందుకు సమయం వృథా అవుతోంది. దీనిని గుర్తించిన ఆయన వా రికి వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన వారోత్సవాల ముగింపు సందర్భంగా మధ్యాహ్న భోజ నాన్ని ప్రారంభించారు. పోటీ పరీక్షలు పూర్తయ్యేంత వరకు సుమారు మూడు నెలలపాటు కార్యక్రమాన్ని కొనసాగిస్తానన్నారు.
● అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment