‘సీఎం పదవిని కాపాడుకోవడానికే విమర్శలు’ | - | Sakshi
Sakshi News home page

‘సీఎం పదవిని కాపాడుకోవడానికే విమర్శలు’

Published Thu, Nov 21 2024 12:03 AM | Last Updated on Thu, Nov 21 2024 12:03 AM

-

నిర్మల్‌చైన్‌గేట్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆపార్టీ సీనియర్‌ నాయకుడు రావుల రాంనాథ్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన హోదాను మరిచి మాట్లాడుతున్నారన్నారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి నరేంద్ర మోదీకి, గుజరాత్‌కు గులాంగిరి చేస్తున్నాడని వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. సోనియాగాంధీకి గులాంగిరి చేస్తున్న మీరు ఇటలీకి గులాంగిరివి కావా అని ప్రశ్నించారు. ఏడాది కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సాధించింది ఏమిటో ప్రజలకు వివరించాలన్నారు. ఆరు గ్యారెంటీలు, 240 హామీలు వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో ప్రజలు క్షమించరన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement