డీఈవో రామారావు బాధ్యతల స్వీకరణ
నిర్మల్రూరల్: జిల్లా విద్యాశాఖ అధికారిగా పి.రామారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన భద్రాది కొత్తగూడెం జిల్లా విద్యాశాఖలో అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తుండగా ఎఫ్ఏసీ డీఈవోగా జిల్లాకు బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో డీఈవోగా పనిచేసిన రవీందర్రెడ్డి రిలీవ్ అయి ములుగు ఎఫ్ఏసీ డీఈవోగా బదిలీపై వెళ్లారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఈవోను కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సన్మానించారు. అనంతరం డీఈవో బాసరకు వెళ్లి జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది పూలమాల, శాలు వాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాసర బాలుర, బాలికల ఉన్న త పాఠశాలలు, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ‘పది’ విద్యార్థుల ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఆయన వెంట కార్యాలయ సిబ్బంది వెంకటరమణ, భోజన్న, భానుప్రసాద్, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment