అవగాహన ఉండాలి
మహిళలకు చట్టాలపై
● ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్‌టౌన్: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో షీ టీం, భరోసా సిబ్బందితో కలిసి లైంగిక వేధింపులు, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, పోక్సో చట్టాలు, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, విద్యార్థుల భద్రత, రక్షణ కొరకు షీ టీం బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఆకతాయిలు వేధింపులకు గురిచేసినా మానసికంగా, శారీరకంగా హింసించినా, సోషల్ మీడియా ద్వారా వేధించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మైనర్ అయితే కౌన్సిలింగ్, మేజర్ అయితే కేసులు నమోదు చేస్తామన్నారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త వ్యక్తులు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా లాంటివి మీ దృష్టికి వస్తే డయల్ 100 లేదా 1098 లేదా షీ టీం 8712659550 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ వినోద్, షీ టీం భరోసా మహిళా ఎస్సై సుమంజలి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment