‘మహా’ తీర్పు ఇచ్చేందుకు..
నిర్మల్: ‘యా దాదా.. మత్‌దాన్ కరా.. ఆపల్యా మహారాష్ట్రాత్ నివడణుకా ఆహేత్..’ అంటూ సొంత రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు రావాలంటూ పిలుపు రావడంతోనే మరాఠాలు మహారాష్ట్ర తరలివెళ్లారు. బుధవారం మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో మంగళవారం రాత్రి వరకు జిల్లా నుంచి వందలాది ఓట ర్లు మహారాష్ట్రలోని స్వస్థలాలకు బయల్దేరి వెళ్లా రు. మరాఠాలు విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యవసా య, వ్యాపారాలరీత్యా జిల్లావ్యాప్తంగా మరాఠాలు స్థిరపడ్డారు. సరిహద్దులోని చాలా గ్రామాల్లో ఓటర్లకు తెలంగాణ, మహారాష్ట్రలో రెండుచోట్లా ఓట్లు ఉన్నాయి. ధర్మాబాద్, భోకర్, కిన్వట్ తాలు కాల నుంచి జిల్లాకు వచ్చిన మరా ఠాలకు ఇక్కడ ఓట్లు ఉన్నాయి. వాళ్లు తమ స్వస్థలాల్లోనూ ఓటుహక్కును కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలోనే చాలామంది ఓటేసేందుకు తరలివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment