నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Wed, Nov 20 2024 12:09 AM | Last Updated on Wed, Nov 20 2024 12:09 AM

నిర్మ

నిర్మల్‌

ఎక్సైజ్‌ శాఖకు

మద్యం బాటిళ్ల అప్పగింత

నిర్మల్‌టౌన్‌: ఎకై ్సజ్‌ శాఖకు నిర్మల్‌ ఆర్టీసీ అధికారులు మంగళవారం మద్యం బాటిళ్లు అప్పగించారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌కు వస్తున్న రాజధాని బస్సులో దొరికిన 3 బాటిళ్లను డిపో మేనేజర్‌ ప్రతిమారెడ్డి ఆదేశాల మేరకు ఎకై ్సజ్‌ శాఖకు అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ రాజశేఖర్‌ సమక్షంలో అప్పగించారు.

బుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

సర్వే సజావుగా నిర్వహించాలి

డీపీవో శ్రీనివాస్‌

కుంటాల: సమగ్ర కుటుంబ సర్వేను సజావుగా నిర్వహించాలని డీపీవో శ్రీనివాస్‌ సూచించా రు. మండలంలోని కల్లూరులో కొనసాగుతున్న సర్వేను మంగళవారం పరిశీలించారు. సర్వేకు వెళ్లే ముందు ఇంటి యజమానికి సమాచారం ఇవ్వాలన్నారు. కుటుంబ యజమానులు ఎన్యూమరేటర్లకు సహకరించాలని కోరారు.

నాగమ్మ చెరువు, కరిసెల గుట్టను గుల్లచేస్తున్న మాఫియా

అనుమతులు లేకుండా

రోడ్డు నిర్మాణానికి తరలింపు

అడ్డుకున్న వీడీసీ సభ్యులు..

అయినా తరలింపు ఆపని కాంట్రాక్టర్‌

సారంగపూర్‌: ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో మట్టి తరలించాలన్నా.. గుట్టలను పగలగొట్టాలన్నా.. చెరువులు, కుంటల్లో నీళ్లు ఇతర పనులకు వినియోగించాలన్నా.. అనుమతి తప్పనిసరి. కానీ, సారంగాపూర్‌ మండలంలో మాత్రం దేనికీ అనుమతి తీసుకోరు. అడిగేవారు లేకపోవడంతో ప్రకృతి సంపదను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారు. జామ్‌ గ్రామ సమీపంలోని చెరువు, గుట్ట నుంచి అక్రమంగా మొరం తరలించుకుపోతున్నారు. ‘తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత’ అన్నట్లుగా ఈ దందా సాగుతోంది.

సారంగాపూర్‌ మండలం జామ్‌ గ్రామ సమీపంలో ఉన్న కరిసెలగుట్ట ఒకప్పుడు పండ్ల చెట్లు, పక్షుల కిలకిలా రావాలతో పచ్చగా కళకళలాడేది.పెద్ద పెద్ద ఇప్ప చెట్లు గిరిజనులకు ఉపాధి కల్పించేవి. వన భోజనాలకు గ్రామస్తులు ఈ గుట్టకే వచ్చేవారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేవారు. పక్కనే నాగ మ్మ చెరువు నుంచి వచ్చే స్వచ్ఛమైన చల్ల గాలితో ఎంతో ఆహ్లాదంగా అనిపించేది. మొరం మాఫియా కన్ను ఈ గుట్టపై పడింది. దీంతో క్రమంగా కరిగి పోతూ కరిసెలగుట్ట కళ తప్పింది. ఇప్పుడు చుట్టూ కందకాలు దర్శనమిస్తున్నాయి. దీంతో కరిసెలగుట్ట కందకాల దిబ్బలా మారిపోయింది. వేసవిలో మొ రం మాఫియా చెరువునూ వదలడం లేదు. అనుమతులు లేకుండానే భారీ యంత్రాలతో మట్టిని తరలించుకుపోతోంది. దీంతో చెరువులో గుంతలు బావులను తలపిస్తున్నాయి. నీళ్లు తాగేందుకు వెళ్లే పశువులు ఈ గుంతల్లో పడి మృతిచెందుతున్నాయి. ఈతకు వెళ్లే చిన్నారులు, చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకూ ప్రమాదం పొంచి ఉంది.

నిర్మల్‌, మహారాష్ట్రలకు తరలింపు....

కొంతమంది రాత్రి సమయాల్లో యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుపుతూ నిర్మల్‌తోపాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇటు రెవెన్యూ అధికారులుగానీ, అటు మైనింగ్‌ అధికారులుగానీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొరం తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం ఇవ్వగానే వచ్చి చూసి వెళ్లిపోతున్నారు. ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదు. ఒక్క వాహనాన్ని సీజ్‌ చేసిన దాఖలాలు లేవు.

న్యూస్‌రీల్‌

వీడీసీ సభ్యులు అడ్డుకున్నా...

తాజాగా జామ్‌ నుంచి మహవీర్‌తండాకు రోడ్డు వేస్తున్న కాంట్రాక్టరు పెద్దపెద్ద వాహనాల ద్వారా మొరం తరలించుకుపోతున్నాడు. విషయం తెలుసుకున్న జామ్‌, చిన్నూరు, పెద్దూరు వీడీసీ సభ్యులు తవ్వకాలను అడ్డుకున్నారు. అయినా వినిపించు కోకుండా తవ్వకాలు జరుపుతూనే ఉన్నాడు. మొరం తవ్వకాలకు మైనింగ్‌, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. ప్రభుత్వానికి ఫీజు చెల్లించాలి. కానీ, ఎలాంటి ఫీజు చెల్లించకుండా, ఎవరి అనుమతి తీసుకోకుండానే మొరం తరలించుకుపోతున్నారు.

ఇష్టానుసారం తవ్వకాలు..

మొరం తవ్వకాలు జరిపితే ఒక క్రమపద్దతిలో జరపాలి. కానీ నాగమ్మ చెరువులో మాత్రం ఎవరికి తోచిన ప్రాంతంలో వారు తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో చెరువంతా పెద్దపెద్ద గుంతలు, కందకాలే ఉన్నాయి. కరిసెల గుట్టను ఆనుకుని ఉన్న ఎత్తయిన గుట్టను కూడా సగానికి తవ్వేశారంటే మొరం దందా ఏమేరకు సాగుతోందో ఊహించుకోవచ్చు.

చర్యలు తీసుకుంటాం...

కరిసెలగుట్ట వద్ద, నాగమ్మ చెరువు పక్కనే మొరం తవ్వుతున్నారని సమాచారం అందింది. ఆర్‌ఐని పంపించి తవ్వకాలను నిలిపివేయించాం. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు జరిపితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కరిసెల గుట్ట అధికారుల పర్యవేక్షణలో ఉంది.

– శ్రీదేవి, తహసీల్దార్‌, సారంగాపూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
నిర్మల్‌1
1/4

నిర్మల్‌

నిర్మల్‌2
2/4

నిర్మల్‌

నిర్మల్‌3
3/4

నిర్మల్‌

నిర్మల్‌4
4/4

నిర్మల్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement