క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: కొత్తగా పోలీస్ ఉద్యోగంలో చేరినవారు సమయపాలన పాటిస్తూ.. క్రమశిక్షణతో, నిజాయతీగా విధులు నిర్వహించాలని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయం నుంచి కొత్త సిబ్బందితో శనివారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇతర శాఖలతో పోలిస్తే పోలీస్ ఉద్యోగం అనేది గౌరవప్రదమైన, సవాళ్లతో కూడినదని తెలిపారు. పోలీస్ జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమైనదన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని చెప్పారు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. విధినిర్వహణలో సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ ఉపేందర్‌రెడ్డి, భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, ఐటీ, డీసీఆర్‌బీ, జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment