అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: జిల్లాలో శాంతి భద్రతలు భంగం లేకుండా అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపుతున్నట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2024లో సాధించిన పురోగతి, వార్షిక నేర నివేదిక వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది శాంతి భద్రతలు బాగున్నాయని, ఒకటి, రెండు ఘటనలు మినహా పూర్తి అదుపులో ఉన్నాయన్నారు. ఈ ఏడాది నేరాలు కాస్త పెరిగాయని తెలిపారు. 2023లో 2,967 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 3,524 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, వినాయకచవితి, రంజాన్, దసరా ఉత్సవాలు ప్రశాతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ ఘటనలను సామరస్యంగా పరిష్కరించామని తెలిపారు. బాసరలో జరిగిన మర్డర్ కేసులో నిందితులను వారం వ్యవధిలోనే పట్టుకున్నట్లు పేర్కొన్నారు. మంగళ్‌సింగ్ తండాలో గంజాయి సాగు చేస్తున్న ఆరుగురిని ఇటీవల అరెస్టు చేసి సుమారు రూ.70 లక్షల విలువైన గంజాయి మొక్కలు జప్తు చేశామన్నారు. దిలావర్‌పూర్ ఇథానల్ పరిశ్రమ సంబంధించిన ఘటనలో పోలీసులు సామరస్యంగా వ్యవహరించారన్నారు. సమావేశంలో బైంసా ఏఎస్పీ అవినాష్, అడిషనల్ ఎస్పీ ఉపేంద్రరెడ్డి, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, పట్టణ, రూరల్ సీఐలు ప్రవీణ్‌కుమార్, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు రవికుమార్, రాజశేఖర్, రాంనిరంజన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment