దాగాంలో రక్తదాన శిబిరం
తానూరు: మండలంలోని దాగాం గ్రామంలో శ్రీస్వామి నరేంద్రాచార్య మహరాజ్ సంస్థాన్ తెలంగాణ పీఠం ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. తెలంగాణ పీఠం సభ్యులు కాంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జగద్గురు నరేంద్రాచార్య మహరాజ్ ఆదేశాల మురకు జనవరి 4 నుంచి 19వ తేదీ వరకు దేశమంతా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామిజీ సంకల్పంలో భాగంగా లక్ష యూనిట్ల రక్తం ప్రభుత్వానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన యువకులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment