నిర్మల్
‘నవోదయ’కు సర్వం సిద్ధం
నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కోతులతో కొండంత కష్టం
తానూరు మండలం ఎల్వి గ్రామస్తులను కోతులు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇళ్లపై ఉన్న పెంకులు తీస్తూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి.
IIIలోu
శనివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2025
IIలోu
అంతర్జాతీయ కరాటే
పోటీలకు ఎంపిక
నిర్మల్‌టౌన్: జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే అంతర్జాతీయ కరాటే పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో అమ్ముల భూషణ్, సుకన్య, అభిషేక్, ఎస్‌కే.అమన్, ఇర్ఫాన్ ఉన్నారు. వీరిని జపాన్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తేజేంద్రసింగ్ భాటియా, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ అభినందించారు.
రేషన్ సర్వే కొనసాగుతోంది..
నిర్మల్ జిల్లాలో నూతన పథకాల అమలు కోసం అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించాం. రేషన్ కార్డుల కోసం 17,491 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 2,924మంది అర్హులుగా గుర్తించాం. సర్వే కొనసాగుతోంది.
– అభిలాషఅభినవ్, కలెక్టర్, నిర్మల్
నిర్మల్: ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులను ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఆదేశించారు. ఈనెల 26 నుంచి అమలు చేయనున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులపై నిర్మల్ కలెక్టరేట్ సమావేశమందిరంలో ఉమ్మడి జిల్లా స్థాయి ప్రణాళిక–కార్యాచరణపై సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఇందులో నాలుగు జిల్లాల కలెక్టర్లు అభిలాష అభినవ్, రాజర్షిషా, కుమార్‌దీపక్, వెంకటేష్ దోత్రే, ఎమ్మెల్సీ దండే విఠల్, నిర్మల్, ఖానాపూర్, ముధోల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వెడ్మ బొజ్జుపటేల్, రామారావ్ పటేల్, పాయ ల శంకర్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, ఇతరశాఖల అధి కారులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రికి నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల పూలమొక్కలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
పకడ్బందీగా అమలు చేయాలి..
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈనెల 26 నుంచి ప్రారంభించనున్న పథకాలను రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలన్నారు. గ్రామాల్లో గ్రామసభలు, పట్టణాల్లో వార్డుసభలు నిర్వహించి గుర్తించిన అర్హుల వివరాలు వెల్లడించాలన్నారు. సమీక్షలో ప్రజాప్రతినిధులు కొత్త పథకాలపై లేవనెత్తిన పలు సందేహాలకు మంత్రి సమాధానాలిచ్చారు. రేషన్‌కార్డులతోపాటు ఇతర సందేహాలనూ సీఎం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. నిర్మల్ ఉత్సవాలను విజయంతంగా నిర్వహించినందుకు కలెక్టర్, అధికారులను మంత్రి అభినందించారు. సమావేశంలో ప్రధానంగా బోథ్, ఆదిలాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులకూ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కోరారు. భూములు ఉన్నా పట్టాలు లేని గిరిజనులకూ రైతుభరోసా అందించాలన్నారు. నిర్మల్, ముధోల్ ఎమ్మెల్యేలు డబుల్‌బెడ్రూం, ఇందిరమ్మ ఇళ్లపై సందేహాలు వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ రేషన్‌కార్డుల సర్వేలో చాలామంది ఉద్యోగుల పేర్లు ఉన్నాయని, అర్హులకు మాత్రం రాలేదని వాటిని సరిచేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధిహామీ కూలీలకు అందించే ఆత్మీయ భరోసా పట్టణ పేదలకూ అందించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వారంతా కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్లు సమావేశంలో అడిగిన పలు ప్రశ్నలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సమాధానాలు చెప్పారు. సమావేశంలో రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల మంత్రికి హెల్మెట్ అందించగా సీతక్క దానిని పెట్టుకున్నారు. సమావేశానికి తూర్పు జిల్లాల ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం గమనార్హం. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, శ్యామలాదేవి, దీపక్ తివారి, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, రాజురా సత్యం, గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్‌అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
పారదర్శకంగా అమలుకు చర్యలు
రేషన్‌కార్డు సమస్యలు, ఎమ్మెల్యేల సూచనలు సీఎం దృష్టికి తీసుకెళ్తా..
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
నిర్మల్‌లో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం
నోటిఫైడ్ ఏరియాలో ఎలా..?
ప్రభుత్వం కొత్త పథకాలను మందమర్రి వంటి నోటిఫైడ్ ఏరియాలలో ఎలా ఇస్తారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనేతర రైతులకూ రైతుభరోసా ఇవ్వాలి.
–దండె విఠల్, ఎమ్మెల్సీ
ఇళ్లస్థలాలు లేనివారికి ఎలా..
ఇందిరమ్మ ఇళ్లను ఇంటిస్థలాలు లేని పేదలకు ఎలా ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు అన్ని పథకాలూ పారదర్శకంగా పేదలకు అందేలా చర్యలు చేపట్టాలి. మున్సిపాలిటీల పరిధిలోని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎలా ఇస్తారో తెలుపాలి. – ఏలేటి మహేశ్వర్‌రెడ్డి,
ఎమ్మెల్యే, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment