వాతావరణం
పొద్దంతా ఎండగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. చలి ప్రభావం కాస్త పెరుగుతుంది.
అక్కగా చెబుతున్న.. హెల్మెట్ పెట్టుకోండ్రి
నిర్మల్: ‘అక్కగా చెబుతున్న.. బండి నడిపేటోళ్లు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండ్రి. ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదు..’ అన్నట్లుగా మంత్రి సీతక్క అవగాహన కల్పించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రోడ్డుభద్రత మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎస్పీ జానకీషర్మిల అందించిన హెల్మెట్ ధరించి రోడ్డుభద్రత నిబంధనలను పాటించాలని సూచించారు.
బాసరలో భక్తుల రద్దీ
బాసర : సంక్రాంతి సెలవులు శుక్రవారంతో ముగియనుండడం, సంకష్టహర చతుర్థి ఉండడంతో బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులతో అక్షర శ్రీకార పూజలు చేయించారు. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది.
అమ్మవారికి రూ.లక్ష విరాళం
శ్రీజ్ఞానసరస్వతిదేవి అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన రమామూర్తి దంపతులు రూ.లక్ష చెక్కును ఆలయ ఇన్‌చార్జి ఈవో నవీన్‌కుమార్‌కు అందజేశారు. విరాళాన్ని అన్నదానానికి వినియోగించాలని దంపతులు కోరారు. ఈసందర్భంగా వారిని శాలువాతో అధికారులు సత్కరించి అమ్మవారి ప్రసాదం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment