ఉపాధి కోసం వెళ్లి.. ఊచలు లెక్కిస్తున్నారు..
● మలేషియా జైలులో జిల్లావాసులు.. ● స్వగ్రామాలకు తీసుకురావాలని కుటుంబ సభ్యుల వినతి
నిర్మల్‌ఖిల్లా/కడెం: కడెం మండలం లింగాపూర్‌కు చెందిన రాచకొండ నరేశ్, తలారి భాస్కర్, గుండా భూమరాజు, గురజాల రాజేశ్వర్, గురిజాల శంకర్ గత అక్టోబర్‌లో మలేషియా వెళ్లి అక్కడి పోలీసుల కు చిక్కారు. ఏజెంట్ల మోసానికి గురైన వీరిని కోర్టులో హాజరుపరచగా జైలు శిక్ష పడింది. ప్రస్తు తం వీరు జైలులోనే మగ్గుతుండగా బాధిత కుటుంబాలవారు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా తమవారిని విడిపించాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. శుక్రవారం ప్రవాసీ మిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, ఖానాపూర్ మండలాధ్యక్షుడు దొనికేన దయానంద్ బాధిత కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు దృష్టికి సమస్య తీసుకెళ్లా రు. ఎమ్మెల్యే తక్షణమే ఎన్‌ఆర్‌ఐ వింగ్ చైర్మన్ అంబాసిడర్ బీఎం.వినోద్‌కుమార్‌కు ఫోన్‌లో సమాచా రమందించారు. మలేషియా ఎంబసీతో సంప్రదింపులు జరిపి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment