నిర్మల్‌ఖిల్లా: జిల్లాకేంద్రానికి చెందిన ప్రముఖ పద్యకవి, సంస్కృతోపన్యాసకులు, తెలంగాణ రచయితల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌కు జాతీయ తెలుగు సాహిత్య విశిష్ట సేవా పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సంస్థాన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దృశ్యకవి అమరకుల చక్రవర్తి తదితరుల చేతుల మీదుగా కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి పుణ్యక్షేత్రంలో నిర్వహించిన కవి సమ్మేళన కార్యక్రమంలో ఈ పురస్కారం బి.వెంకట్ అందుకున్నారు. కర్నూలు జిల్లా కళాపీఠం కన్వీనర్ మాలేకర్ నాగజ్యోతి, కోకన్వీనర్ సువర్ణ జోషి, ప్రముఖ కవి అరటి నాగేశ్వరరావు తదితరులు వెంకట్‌ను పురస్కారంతోపాటు శాలువా, నూతన వస్త్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఇదివరకే పద్య రచన, సాహితీ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న వెంకట్ తాజాగా సాహిత్య విశిష్ట సేవా పురస్కారాన్ని పొందడం పట్ల నిర్మల్ జిల్లాకు చెందిన కవులు, కళాకారులు,సాహితీవేత్తలు అభినందనలు తెలిపారు.
పురస్కారం స్వీకరిస్తున్న వెంకట్
Comments
Please login to add a commentAdd a comment