● నేటి నుంచి 20 వరకు పలు సెషన్లలో పరీక్షలు.. ● సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ● అభ్యర్థులకు తప్పని దూర భారం
నిర్మల్‌ఖిల్లా: నేటి నుంచి టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) ప్రారంభం కానుంంది. జిల్లా కు చెందిన అభ్యర్థులు దాదాపు 6 వేల పైచిలు కు మంది వివిధ తేదీల్లో పరీక్షలకు హాజరుకానున్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలో సెంటర్ లేకపోవడంతో ఇతర జిల్లాల్లో పరీక్ష రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో మాత్రమే ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఈ టెట్ పరీక్షలు ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో సౌకర్యం లేక, పరీక్ష కేంద్రం కేటాయించలేదు. దీంతో జిల్లా చెందిన అభ్యర్థులు 100 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని కేంద్రాల్లో పరీక్ష రాయడానికి వెళ్లాల్సి వస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లా కేంద్రాలతోపాటు మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో జిల్లాకు చెందిన అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు ఒకరోజు ముందుగానే ఆయా ప్రాంతాల వెళ్లాల్సి వస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యయ, ప్రయాసలతోపాటు దూరభారం ఉంటుందని వాపోతున్నారు. టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న సమయంలో పరీక్ష కేంద్రాలను తగిన ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక చేసుకున్నప్పటికీ సుదూర ప్రాంతాల్లో కేటాయించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment