అడ్డ‘దారికి’.. ఆర్టీసీ సహకారం..!
భైంసాటౌన్: పట్టణంలో ఆర్టీసీ అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. దాదాపు రెండు నెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు ఆర్టీసీ ప్రహరీలో కొంతమేర కూల్చివేశారు. వాస్తవానికి బస్టాండ్ నుంచి ప్రయాణికులు తమవైపు రావాలనే ఉద్దేశంతో ఈ పని చేసి ఉంటారన్న అనుమానాలున్నాయి. ఈ సందేహాలకు బలమిచ్చేలా ఆర్టీసీ అధికారులు ప్రహరీని పునరుద్ధరించకపోగా, సంస్థ డబ్బుతో మెట్లు ఏర్పాటు చేయడం, ప్రహరీకి అవతలివైపు ప్రైవేట్ స్థలంలో నిర్మించడం గమనార్హం. దీంతో బస్టాండ్ నుంచి ప్రయాణికులను బయటికి పంపడమే అన్నట్లు అనిపిస్తోంది.. అధికారుల తీరు. ఈ విషయమై డీఎం హరిప్రసాద్‌ను వివరణ కోరగా, మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు బయటకు వెళ్లడం లేదని చెప్పడం విశేషం. చుట్టు పక్కల కాలనీల నుంచి ప్రయాణికులు లోనికి వచ్చేందుకు వీలుగా మెట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ, మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగి, సకాలంలో బస్సులు లేక కొందరు ప్రయాణికులు బస్టాండ్ ప్రహరీకి అవతల ఉన్న ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయమై దృష్టి సారించి సంస్థ ఆదాయానికి గండి పడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment