భైంసా బంద్ ప్రశాంతం
భైంసాటౌన్: నియోజకవర్గంలో హిందూ దేవాలయాలపై దాడులు, దొంగతనాలను నిరసిస్తూ దేవాలయాల పరిరక్షణ సమితి, హిందూ సంఘాల పిలుపు మేరకు భైంసా పట్టణంలో బుధవారం హిందువులు బంద్ పాటించారు. ఉదయం నుంచే దుకాణాలు స్వచ్ఛందంగా మూసి ఉంచారు. స్థానిక కప్‌డా మార్కెట్, పాత, కొత్త సోనాచాందీ మార్కెట్, గాంధీగంజ్, బస్టాండ్ ఏరియా, నిర్మల్ చౌరస్తా ప్రాంతాల్లో రోజంతా దుకాణాలు బంద్ చేశారు. 30 యాక్ట్ అమలు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఏఎస్పీ అవినాష్‌కుమార్ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తు మోహరించారు. తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ స్థానికంగానే ఉండి పరిస్థితిని సమీక్షించారు. అలాగే, నాగదేవత ఆలయంలో దొంగతనం ఘటనలో దుండగులను గుర్తించి శిక్షించాలని, అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హిందూ సంఘాల నాయకులు ఏఎస్పీ అవినాష్‌కుమార్‌తోపాటు తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్‌కు వేర్వేరుగా మెమొరాండం అందజేశారు. కార్యక్రమంలో చింతపండు మహేశ్, గుజ్జుల్‌వార్ వెంకటేశ్, పెండెప్ కాశీనాథ్, పెరుగు నవీన్, బీజేపీ నాయకులు మల్లేశ్వర్, గౌతం పింగ్లే, రాజన్న, అనిల్, తూమోల్ల దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment