నాగదేవత ఆలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
భైంసాటౌన్: పట్టణ శివారులోని నాగదేవత ఆలయాన్ని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ బుధవారం సందర్శించారు. ఆలయంలో చోరీ తీరును అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో హుండీతోపాటు, విగ్రహ ధ్వంసంపై తీవ్రంగా స్పందించారు. పోలీసులు దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఆయన వెంట బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్, సుష్మారెడ్డి, శంకర్ ఉన్నారు. నాగదేవత ఆలయంలో విగ్రహం ధ్వంసం, దొంగతనం ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.మోహన్రావు పటేల్ డిమాండ్ చేశారు. అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment