గాంధీ విగ్రహానికి ‘సమగ్ర’ ఉద్యోగుల వినతి
నిర్మల్ రూరల్: సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యా యమైన డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా కేంద్రంలో చేపట్టిన సమ్మె బుధవారం 24వ రోజుకు చేరింది. ఉద్యోగులు దీక్ష శిబిరం ఎదుట ఉన్న గాంధీ పార్కులోని గాంధీ విగ్రహానికి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందించిన నిరసన తెలిపారు. 20 ఏళ్లగా చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నామన్నారు. అధికారులు విద్యాశాఖలో ఏ పని చెప్పినా చేశామని తెలిపారు. ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించి వెట్టిచాకిరీ, శ్రమ దోపిడీ నుంచి విముక్తి క ల్పించాలన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆరెపల్లి విజయకుమార్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. గంగాధర్, నరేశ్, రాము, నవిత, గంగాధర్, ఆనంద్, సాయినాథ్, రమేశ్, రాజువర్మ, రమణ, లక్ష్మి, రజిత, అపర్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment