చావే శరణ్యమా?
● కిరోసిన్ డబ్బాతో ప్రజావాణికి..
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ కలెక్టరేట్‌కు ఓ వ్యక్తి కిరోసిన్ బాటిల్‌తో రావడం కలకలం రేపింది. జిల్లాలోని సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామానికి చెందిన మంగలి ముకేష్ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి కిరోసిన్ డబ్బాతో వచ్చాడు. గేటు వద్ద కానిస్టేబుల్ తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. మంగలి ముకేష్ మాట్లాడుతూ ‘‘మా అమ్మ మంగలి రాజవ్వది న్యూ వెల్మల్ గ్రామం. లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి గ్రామంలో సర్వేనంబర్ 176/1లో సొంత భూమి ఉంది. ఈ భూమి సోన్ మండలం న్యూ వెల్మల్‌లో 306/1లో రిజిస్ట్రేషన్ అయింది. సోన్ తహసీల్దార్ సెత్వార్ జరుగుతున్న సందర్భంగా 306/1 సర్వేనంబర్ లక్ష్మణచాంద మండలం పాత పొట్టపల్లి(కె)లో ఉందని లేఖ రాశారు. ధరణి పోర్టల్‌లో ఆ భూమి న్యూవెల్మల్‌లో ఉంది. ఈ భూమి కోసం అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. సోన్ తహసీల్దార్‌ను కలిస్తే తమ పరిధిలో లేదని, లక్ష్మణచాంద తహసీల్దారు కూడా అదే చెబుతున్నారు. దిక్కుతోచక చావే శరణ్యమని కిరోసిన్ వెంట తెచ్చుకున్న..’’ అని తెలిపాడు. అధికారులు తన పేరిట ఉన్న భూమిని మార్చి కొత్త పట్టా పాస్‌బుక్ జారీ చేయాలని కోరాడు. ఈ మేరకు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌కు వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన అదనపు కలెక్టర్ జనవరి 2లోపు సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. సమస్య పరిష్కరించకపోతే కలెక్టరేట్ భవనం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment