హోమం చేసి సమగ్ర ఉద్యోగుల నిరసన
నిర్మల్ రూరల్: ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె సోమవారం 21వ రోజుకు చేరుకుంది. ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్ష శిబిరంలో హోమం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. వేద పండితులు ప్రశాంత్‌శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. విద్యాశాఖ సమగ్ర శిక్షలో అంకితభావంతో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వెట్టి చాకిరీ, శ్రమ దోపిడీ నుంచి ఉద్యోగులను విముక్తి కల్పించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. వీరికి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి గంగాధర్ మద్దతు తెలిపారు. నాయకులు గంగాధర్, నరేశ్, గజేందర్, స్వప్న, నారాయణ, సాగర్, రాము, నవిత, ఆనంద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment