వినతులు.. తీరని వెతలు
● పరిష్కారానికి నోచుకోని సమస్యలు ● గ్రీవెన్స్‌లో అధికారులకు ప్రజల మొర ● ప్రజావాణి వినతులపై దృష్టి సారించాలి ● అదనపు కలెక్టర్ల ఆదేశం
నిర్మల్‌చైన్‌గేట్: అధికారుల నిర్లక్ష్యం కారణంగా రుణమాఫీ కాలేదని ఒకరు.. తన భూమి లాక్కోవాలని చూస్తున్నారని ఒకరు.. డబుల్ బెడ్‌రూంలో సౌకర్యాలు లేవని మరొకరు.. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఏళ్ల తరబడి తిరుగుతున్నా వినతులు తీసుకోవడంతోనే సరిపోతుంది.. సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ సమస్యలపై దాదాపు 45 అర్జీలు రాగా.. అదనపు కలెక్టర్లు కిశోర్‌కుమార్, ఫైజాన్‌అహ్మద్ స్వీకరించారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపర్చాలని సూచించారు. దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందజేయాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment