‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
భైంసాటౌన్: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి అన్నారు. ముధోల్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్‌ఎస్ కాటన్‌లో బూత్ కమిటీ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పార్టీ సాధారణ, క్రియాశీలక సభ్యత్వ నమోదు పూర్తయిందని తెలిపారు. ఈనెల 29, 30, 31 తేదీల్లో మండలాధ్యక్షుల ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ భూమయ్య, ఎన్నికల ఇన్‌చార్జి రవిపాండే, రాష్ట్ర కార్యవర్గసభ్యులు నారాయణరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ సాయినాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు తాలోడ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment