రక్తహీనత నివారణకు కృషి చేద్దాం
● డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్
సారంగపూర్: రక్తహీనత లేని, పూర్తి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ సహకారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ అన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో రక్తహీనత నిర్ధారణకుగాను హెచ్‌బీ(హీమోగ్లోబిన్) పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేరోజు జిల్లా వ్యాప్తంగా హెచ్‌బీ పరీక్షలు నిర్వహించేందుకు మాక్‌డ్రిల్ నిర్వహించామని తెలిపారు. ఇది పూర్తిస్థాయిలో సఫలమైతే మున్ముందు ఇలాంటి పరీక్షలు వారంలో ఒకరోజు తప్పకుండా చేయించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. ఇప్పటికే ఎంతోమంది గర్భిణుల్లో రక్తహీనత సమస్యలు ఉత్పన్నమవుతున్న తరుణంలో ఈపరీక్షలు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. అనంతరం చించోలి(బి) గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో నిర్వహించిన మాక్‌డ్రిల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా మాస్‌మీడియా అధికారి రవీందర్, ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమోహన్‌గౌడ్, మోయిన్ అలీ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment