లక్ష్మణచాంద: జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్టులో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జడ్డి అజయ్, సిరి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో ఈ నెల 21న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి టెస్టుకు వెళ్లే విద్యార్థుల ఖర్చుల కోసం నల్ల పురుషోత్తంరెడ్డి రూ.4వేలు, భూష పవన్‌కుమార్ రూ.2వేలు ఆర్థికసాయం అందించినట్లు పాఠశాల హెచ్‌ఎం రాజునాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment