● జంగుబాయి దర్శనానికి వెళ్తుండగా ఐచర్ బోల్తా ● డ్రైవర్
వారంతా తమ ఇలవేల్పు జంగుబాయి పుణ్యక్షేత్రంలో మొక్కు తీర్చుకుందామని సంతోషంగా బయల్దేరారు. ఐచర్‌లో ప్రయాణిస్తూ ముచ్చట్లలో నిమగ్నమయ్యారు. మరికాసేపట్లో ఆలయానికి చేరుకునే వారే. ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం. తేరుకునే లోపే వాహనం బోల్తా పడింది. ఏం జరిగిందో తెలియని పరిస్థితి. అందులో ఉన్నవారు ఒకరిపై ఒకరు పడ్డారు. మరికొంత మంది కింద పడిపోయారు. తీవ్ర గాయాల పాలవడంతో ఆర్థనాదాలు, హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. చాలా మంది కదిలే పరిస్థితి కూడా లేక పోవడంతో ఉన్నచోటే రోధించారు. స్థానికులు గమనించి పోలీసులు, అంబులెన్స్‌లకు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఇలా మొక్కు తీర్చకుండానే తిరుగు పయనమవ్వాల్సిన పరిస్థితి.
– ఆదిలాబాద్‌టౌన్/నార్నూర్/
గుడిహత్నూర్/ఉట్నూర్‌రూరల్
మాలేపూర్ ఘాట్
పాట్నాపూర్
Comments
Please login to add a commentAdd a comment