సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నూతన పథకాల అర్హుల గుర్తింపు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నూతన పథకాల అర్హుల ఎంపిక సర్వే, గ్రామ, వార్డు సభలపై అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. గడువులోపు సర్వే పూర్తి చేసి పథకాలకు అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు సర్వే తీరును పర్యవేక్షించి ఈనెల 21వ తేదీ నుంచి గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎస్వో కిరణ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, డీఆర్డీవో విజయలక్ష్మి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏవోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment