నిర్మల్
మంగళవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2025
లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిచేయాలి
కడెం: లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలని మండలంలోని లక్ష్మీపూర్, కల్లెడ గ్రామస్తులు సోమవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి మంత్రి కొండా సురేఖను కోరారు. కడెం ప్రాజెక్ట్ దిగువన పాండ్వపూర్ వంతెన వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు గతంలో పలుమార్లు సర్వే నిర్వహించారన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే కడెం, దస్తురాబాద్ మండలాల్లోని నవాబ్‌పేట్, లక్ష్మీపూర్, దోస్త్‌నగర్, కల్లెడ, ఆకొండపేట్ గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. నియోజకవర్గంలో పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, దేవాలయాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బరుపటి రమేశ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రేంకల శ్రీనివాస్ యాదవ్, నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, రాజలింగు, తదితరులు పాల్గొన్నారు.
● జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు ఊసేలేని వైనం
● బాసరలో ప్రభుత్వ భూములున్నా ఫలితం శూన్యం
● ఎనిమిదేళ్లుగా జిల్లా వాసుల ఎదురుచూపులు
భైంసా: జిల్లాలోని బాసర మండలంలో ప్రభుత్వానికి సంబంధించిన 800 ఎకరాలకు పైగా భూములు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. 2020లో అప్పటి జిల్లా యంత్రాంగం పరిశ్రమల శాఖ సంయుక్తంగా సర్వే నిర్వహించింది. బాసర ప్రాంతంలో ఎస్‌ఈజడ్(సెజ్–స్పెషల్ ఎకనామిక్ జోన్) ఏర్పాటుపై ప్రభుత్వం చర్చించింది. అప్పట్లో ఇక్కడ పలు పరిశ్రమల కోసం దరఖాస్తులు స్వీకరించింది. భూములు కేటాయించి పరిశ్రమలకు అవసరమైన వసతులు కల్పించాలని సంకల్పించింది. ఈ విషయంపై గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు చర్చలు జరిగాయి. అయినా ఇప్పటికీ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ముందడుగు పడడంలేదు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో ఆదాయంతో పాటు ఇక్కడి యువతకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలి. జిల్లాలో సహజ వనరులు, నీటిసౌకర్యం, రోడ్డు మార్గం ఉన్నా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను కలిసి ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించడంలేదు.
జిల్లా ఏర్పాటై ఎనిమిదేళ్లయినా..
నిర్మల్ జిల్లా ఏర్పాటుచేసి ఎనిమిదేళ్లవుతోంది. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ పరిశ్రమలైతే లేవు. పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లా వెనుకబడి ఉంది. భైంసా పట్టణంలో గతంలో 33కు పైగా పత్తి జిన్నింగు ఫ్యాక్టరీలు ఉండేవి. పత్తి సాగు విస్తీర్ణం తగ్గడంతో ప్రస్తుతం 20 లోపే ఉన్నాయి. మిగిలిన జిన్నింగు ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భైంసా జిన్నింగు ఫ్యాక్టరీలకు అడ్డాగా ఉండేది. ప్రతీ సీజన్‌లో 20 వేల మంది కూలీలకు పత్తి సీజన్‌లో భైంసాలో పని దొరికేది. పత్తి సాగు విస్తీర్ణం తగ్గడం, గులాబీరంగు పురుగు ఉధృతితో రైతులు సాగును తగ్గించడంతో ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయి. ఫ్యాక్టరీల యజమానులు వాటిని ప్లాట్లుగా మార్చి అమ్మేశారు. దీంతో జిల్లాలో చెప్పుకోదగ్గ ఫ్యాక్టరీలున్న భైంసాలోనూ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి.
పక్క జిల్లాలో....
జిల్లా మీదుగా మహారాష్ట్రను కలుపుతూ జాతీయ రహదారి నంబర్ 44, 61 ఉన్నాయి. మరో జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారులకు నిర్మల్ జిల్లా కేంద్రం కూడలిగా ఉంది. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్‌వైపు వెళ్లే ఈ మార్గంలో పక్క జిల్లాల్లో ఎన్నో పరిశ్రమలు కనిపిస్తాయి. మేడ్చల్, రామాయణ్‌పేట్, కామారెడ్డి, బిక్కనూర్, ఆర్మూర్ ఇలా హైదరాబాద్ నుంచి వచ్చే ప్రధాన జాతీయ రహదారికి ఆనుకుని పలు రకాల పరిశ్రమలు నిర్మించారు. గోదావరినది దాటగానే నిర్మల్ జిల్లా సరిహద్దు ప్రారంభం అవుతుంది. జిల్లా సరిహద్దులో కొత్త పరిశ్రమలు ఎక్కడా కనిపించవు.
కొడుకు చనిపోయాడని..
అనారోగ్యంతో కొడుకు చనిపోయాడని తట్టుకోలేని తండ్రి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాసరలో చోటు చేసుకుంది.
8లోu
న్యూస్‌రీల్
సోలార్ ప్లాంట్లు
జిల్లా ఏర్పడ్డాక మూడు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. గత ప్రభుత్వం నిర్మల్‌లో ఐటీడీఏ ఆధ్వర్యంలో తేనెశుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసింది. డెయిరీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పాలశీతలీకరణ కేంద్రం ఉంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సూక్ష్మ చిన్న తరహా అన్నీ కలిపి సుమారు 260 పరిశ్రమలు ఉన్నాయి. కానీ పెద్ద పరిశ్రమలైతే కనిపించడంలేదు. ఇప్పటికై నా ప్రభుత్వ యంత్రాంగం పరిశ్రమల ఏర్పాటు విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి.
ప్రజా ప్రతినిధులు దృష్టి సారిస్తేనే...
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి ఇక్కడి వనరులపై ప్రభుత్వ భూములపై చర్చించాలి. జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చించాలి. నిర్మల్ జిల్లాలో సోయ పంట అధికంగానే సాగవుతుంది. పండించే పంటలకు సంబంధించిన ఎలాంటి పరిశ్రమలు ఇక్కడ లేవు. పంటలకు అనువుగా ఉండే పరిశ్రమలు ఏర్పాటుచేస్తే రైతులకు ధరలు కలిసివస్తాయి. జిల్లాలో పండించే పంటల ఆధారంగా వాటికి అనుబంధంగా ఉండే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ...
నిర్మల్ జిల్లాలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ పరిశ్రమల ఏర్పాటుపై అడుగు ముందుకు పడడంలేదు. పరిశ్రమలకు కావాల్సిన సహజ వనరులు, రవాణా మార్గాలు, అందులో పనిచేసేందుకు కావాల్సిన శ్రామికులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పటి వరకు పరిశ్రమలు మాత్రం ఏర్పాటు కావడంలేదు. ఇక నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో సూక్ష్మతరహా పరిశ్రమలే ఉన్నాయి. కానీ ఒక్క పెద్ద పరిశ్రమ కూడా లేదు. బాసరను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బాసరలో రైలుమార్గం ఉంది. పక్కనే గోదావరి నది ఉంది. ఈ పరిసరాల్లోనే బాసర మండలంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు ఎందుకు జరుగడంలేదో తెలియడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment