లక్ష్మీనరసింహుడి తెప్పోత్సవం
కడెం: మండలంలోని దిల్దార్‌నగర్, ఎలగడప, సారంగపూర్ సమీపంలోని అక్కకొండ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మూడవ రోజు సోమవారం ఉదయం స్వామివారికి చందన మహోత్సవం.. సాయంత్రం సమీప గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గజ్జలమ్మ కల్యాణం
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మదేవి ఆలయ ఐదో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీగజ్జలమ్మదేవి కల్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. వేదపండితులు శ్రీగురుమంచి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ఉదయం నిత్యవిధి, యజ్ఞం, శ్రీగజ్జలమ్మ కల్యాణం జరిపించారు. సాయంత్రం రథోత్సవం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో, దీక్షాపరులు నియమనిష్టలతో గజ్జలమ్మదేవిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావుపటేల్ అమ్మవారిని దర్శించుకున్నారు. వడ్ల లక్ష్మి–సత్తెయ్య, గంగాధర, నిహారిక–రాజు, సుజాత– శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
లక్ష్మీనరసింహుడి తెప్పోత్సవం
లక్ష్మీనరసింహుడి తెప్పోత్సవం
Comments
Please login to add a commentAdd a comment