![విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11nrl203-340114_mr-1739299667-0.jpg.webp?itok=K1_d1XsV)
విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు
నిర్మల్ రూరల్: పదోతరగతి విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా పేర్కొన్నారు. టీ–శాట్ టీవీ చానెల్ ద్వారా యోగితారాణా పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై పలు సూచనలు చేశారు. మంగళవారం మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో కలిసి డీఈవో రామారావు ముఖాముఖి కార్యక్రమాన్ని వీక్షించారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై సాధన చేసి, ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులు చదువుపై దృష్టి సారించేలా చూడాలని సూచించారు. ఆయా సబ్జెక్టుల రివిజన్ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. స్లిప్ టెస్టులు, ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కార్య క్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పద్మ, జిల్లా పరీక్షల బోర్డు సహాయ కార్యదర్శి భానుమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment