![రూ.150 బీరు.. రూ.180కి విక్రయం..!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11mdl204-340127_mr-1739299666-0.jpg.webp?itok=EaMwUq9c)
రూ.150 బీరు.. రూ.180కి విక్రయం..!
● ధరల పెరుగుదలకు ముందే దోపిడీ
భైంసాటౌన్: బీర్ల ధరల పెంపునకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ ఎంతమేర పెంచాలన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయినా పట్టణంలో కొందరు వైన్స్ నిర్వాహకులు బీర్ల ధరలు పెంచి విక్రయిస్తున్నారు. మంగళవారం పట్టణంలోని బాసర రోడ్డులో గల ఓ వైన్స్‌షాపులో రూ.150 ఎమ్మార్పీ ఉన్న బీరును రూ.180కి విక్రయించినట్లు ఓ మద్యం ప్రియుడు వాపోయాడు. ఈ మేరకు తన ఫోన్‌పే నంబర్ ద్వారా డబ్బులు చెల్లించినట్లు రశీదు చూపాడు. ధరల పెరుగుదలకు ముందే పెంచి విక్రయించడం ఎంతవరకు సబబని అతడు ప్రశ్నిస్తున్నాడు. బీర్ల ధరల పెంపు విషయమై ఎకై ్సజ్ సీఐ నజీర్‌హుస్సేన్‌ను ఈ సందర్భంగా వివరణ కోరగా తమకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేవన్నారు. పాత స్టాకును పాత రేట్లకే విక్రయించాల్సి ఉండగా ఎలాంటి ఆదేశాలు లేకుండానే అధిక ధరలకు విక్రయించడంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment