![అన్నివర్గాలను వంచిస్తున్న కాంగ్రెస్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11nrl401-604991_mr-1739299666-0.jpg.webp?itok=PfFKxPKD)
అన్నివర్గాలను వంచిస్తున్న కాంగ్రెస్
● బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ● ఎమ్మెల్సీ అభ్యర్థులతో సమావేశం
నిర్మల్ రూరల్: రాష్ట్రంలో 14 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చే సిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరో పించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ప ట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ ఎ మ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యతో కలిసి పా ల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ.. ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఉద్యోగులను పే స్కేల్, పీఆర్సీ తదితర అంశాల్లో విఫలమైందని ఆరోపించారు. రి టైర్డయిన వారికి నెలలు గడిచినా బెనిఫిట్స్ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. పెన్షనర్లనూ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య మాట్లాడుతూ.. నిరుద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుంటామని హామీ ఇచ్చారు. ముధోల్ ఎమ్మెల్యే రామారా వుపటేల్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, నా యకులు సత్యనారాయణగౌడ్, అయ్యన్నగారి భూ మయ్య, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్‌రెడ్డి, అ య్యన్నగారి రాజేందర్, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి
నిర్మల్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మ డి ఆదిలాబాద్–నిజామాబాద్–కరీంనగర్–మెదక్ జిల్లాల బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్‌లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమురయ్య మాట్లాడు తూ.. గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు జీతా లు, పీఆర్సీ, డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, వారి హక్కులను కాలరాశాయని ఆరోపించా రు. గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 10వేల పీఎస్‌హెచ్‌ఎం పోస్టుల మంజూరుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జీవో 317 బాధితులకు న్యాయం చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ని ర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని విమర్శించారు. ప్రస్తు తం తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్లనేనని పేర్కొన్నారు. తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు నవీన్, రాష్ట్ర నాయకులు శశికాంత్, రాజేశ్వర్, బీజేపీ నాయకుడు అయ్యన్నగారి భూమయ్య, పెన్షనర్ల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ఎంసీ లింగన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment