పార పట్టి.. చెత్త తొలగించి..
ఖానాపూర్: పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందించేలా అధికా రులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. స్వచ్ఛ నిర్మల్ లక్ష్యంగా ఈ నెల 10 నుంచి 15వరకు పారిశుద్ధ్యం, పచ్చదనం కోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌ను ఖానాపూర్‌లో సోమవారం ప్రారంభించారు. 9వ వార్డులోని బొడ్డోనికుంట చుట్టు పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ ప్రజలు సేద తీరేందుకు మొక్కలు నాటించి సిమెంట్ కుర్చీలు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాక ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్‌ను సంతకాల రూపంలో తీసుకోవాలని సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా చూడడంతోపాటు డ్రైనేజీ నీరు కుంటలో కలవకుండా శాశ్వత పనులు చేపట్టేలా ప్రతిపాదనలు పంపాలని కమిషనర్ జాదవ్ కృష్ణ ఇతర అధికారులను ఆదేశించారు.
కేజీబీవీ తనిఖీ...
అనంతరం మస్కాపూర్‌లోని కేజీబీవీని కలెక్టర్ తనిఖీ చేశారు. భోజన నిర్వహణ, బోధన తీరును పరిశీలించారు. పాఠశాలలో అసంపూర్తి పనులు పూర్తిచేయించడంతోపాటు పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేపట్టి నేడు, రేపు అనే ఫొటోలు పంపాలని డీఈవో రామారావు, తహసీల్దార్ సుజా త, ఎంపీడీవో సునీతను ఆదేశించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. పదోతరగతి విద్యార్థినులతో లెక్కలు చేయించారు. పరీక్షలు సమీపిస్తున్నందున సన్నద్ధం కావాలన్నారు. సరుకుల నిల్వగదిలో దుర్వాసన రావడం, పారిశుద్ధ్య లోపంతో కేబీజీవీ ప్రత్యేక అధికారి సునీతపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. అక్కడి నుంచి సత్తన్‌పల్లి గ్రామానికి వెళ్లి పల్లె ప్రకృతివనాన్ని సందర్శించి స్వయంగా పారిశుద్ధ్య పనులు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దని డీపీవో శ్రీనివాస్‌ను ఆదేశించారు.
‘డబుల్’ అనర్హులపై ఫిర్యాదు..
ఇదిలా ఉండగా డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరులో అనర్హులను ఎంపిక చేయడంపై పలువురు మహిళలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అర్హులమైన తమను కాదని అనర్హులను ఎంపిక చేశారని పేర్కొన్నారు. అనర్హులను తొలగించి అర్హులకు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరుగుతోందని, పూర్తయ్యాక అనర్హులను తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు. పట్టణంలోని పలు చోట్ల సీసీ రోడ్లు లేవని స్థానికులు కలెక్టర్‌కు తెలిపారు.
స్వచ్ఛ డ్రైవ్‌ను ప్రారంభించిన కలెక్టర్..
సమష్టిగా స్వచ్ఛ నిర్మల్‌ను సాధిద్దామని పిలుపు..
పార పట్టి.. చెత్త తొలగించి..
Comments
Please login to add a commentAdd a comment