‘ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి’
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు రంజిత్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వర్గీకరణతో మాల, మాల ఉపకలాలు తీవ్ర అన్యాయం చేశారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టారని తెలిపారు. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన తర్వాత దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ చేయాలన్నారు. నిరసనలో సమితి జిల్లా కన్వీనర్ కుంటోల్ల వెంకటస్వామి, జిల్లా కోకన్వీనర్లు పురుషోత్తం, అడిగ బోస్, డాక్టర్ ప్రభాకర్ సానే, అంబకంటి ముత్తన్న, బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు కొంత మురళీధర్, సమ్పెల్రా రత్నయ్య, దేవుళ్ల మధు, కప్పకంటి సురేశ్, సాద విజయ్, ఆకుల రమేశ్, పి.సతీశ్, తలారి రాజేశ్వర్, కోట సాయిబాబా, డి.సత్యనారాయణ, మాల సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment