![ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mdl78-340110_mr-1739214574-0.jpg.webp?itok=Mo-3Y9GY)
ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
లోకేశ్వరం: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో పరశురాం నాయక్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను డిస్ట్రిక్ ఎగ్జామినేషన్ కమిటీ (డీఈసీ) సభ్యులు సోమవారం పరిశీలించారు. ఈసందర్బంగా డీఐఈవో మాట్లాడుతూ ప్రతీ విద్యార్ధి ప్రాక్టికల్స్ చేసిన తీరు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతుందన్నారు. మాస్ కాపీయింగ్‌కు తావివ్వరాదన్నారు. విద్యార్థులకు కష్టపడి చదివి కళాశాలకు మంచిపేరు తేవాలని సూచించారు. ఆయన వెంట కమిటీ సభ్యులు సునీల్‌కుమార్, జాదవ్ రవికిరణ్, సుధాకర్‌రెడ్డి, నర్సయ్య, కళశాల ప్రిన్సిపాల్ గౌతమ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment